ఒక ఆంగ్ల రాజు యొక్క మొట్టమొదటి 'నిజమైన' చిత్రం కలిగి ఉన్న సుమారు 800 సంవత్సరాల పురాతన బంగారు నాణెం అర మిలియన్ పౌండ్లకు(5.25 కోట్లు) వేలానికి అమ్ముడైంది. ఈ నాణెం 1216 నుండి 1272 వరకు ఇంగ్లాండ్ రాజు అయిన హెన్రీ III యొక్క చిత్రాన్ని కలిగి ఉంది. ఈ బంగారు పెన్నీలు సుమారు 1257 నాటివి, వీటిని గురువారం డల్లాస్ లో జరిగిన హెరిటేజ్ వేలంలో విక్రయించారు. భారతీయ రూపాయల ప్రకారం ఈ కాయిన్ విలువ అక్షరాల 6 కోట్లు అని తెలుస్తుంది.