పంచాయితీ ఎన్నికలను ఏకగ్రీవం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.పంచాయతీలో ఏకగ్రీవాలు చేస్తే వారికి ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది..ఏకగ్రీవాలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఈ మేరకు నాలుగు కెటగిరిలుగా విభజించింది. గ్రామాల్లో వాతావరణం నెలకొనేందుకు ప్రోత్సాహకలు ప్రకటిస్తున్నట్లు స్సష్టం చేసింది. అయితే 2 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలు ఏకగ్రీవం చేస్తే రూ.5 లక్షల ప్రోత్సాహకం అందిస్తారు. 2 వేల నుంచి 5 వేల జనాభా పంచాయతీల ఏకగ్రీవానికి రూ.10 లక్షలు ప్రోత్సాహకంగా ఇవ్వనున్నట్లు తెలిపారు.