ఎన్నికలు అంటే పచ్చగా ఉన్న పల్లెల్లో అగ్గి రాసుకొని పరిణామాలను చోటు చేసుకొనెలా చేస్తుంది.వీటిని నియంత్రించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఏకాభిప్రాయంతో ఏకగ్రీవమైతే గ్రామానికి ప్రోత్సాహక నిధులు పొంది అభివృద్ధి చేసుకోవడానికి వీలుంటుందని, అభిప్రాయ బేధాలు లేకుండా సామరస్యంగా ఉండటానికి దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగానే ఏకగ్రీవ ప్రోత్సాహకాలను ప్రకటించింది. కానీ కక్షలు, కార్పణ్యాలు, గొడవలకు అలవాటైన టీడీపీ నేతలు మాత్రం ఏకగ్రీవాలు వద్దు.. అంటూ వ్యూహారచనలు చేస్తున్నారు.