ఏపి లో జరగనున్న పంచాయితీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు.నాలుగు దశల్లో ఎన్నికలు జరగనున్నాయన్న విషయం తెలిసిందే..కాగా, ఈ ఎన్నికలకు ఇప్పటికే పకడ్బందీగా ఎన్నికల కమీషన్ రంగం సిద్ధం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 175 మండలాల్లోని దాదాపు 4వేల గ్రామ పంచాయతీల్లో తొలి విడత ఎన్నికల నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈనెల 31తో నామినేషన్ల దాఖలుకు గడువు పూర్తికానుంది. ఫిబ్రవరి 1న నామినేషన్ల పరిశీలన, ఫిబ్రవరి 2న నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలిస్తారు. ఫిబ్రవరి 3న అభ్యంతరాలపై తుది నిర్ణయం తీసుకుంటారు