ఎంపీ రఘురామకృష్ణం రాజు రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి తనదైన స్టైల్లో సెటైర్లు వేశారు. ముఖ్యమంత్రి జగన్ తో పాటు ప్రభుత్వ ప్రజావ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఉద్యోగ సంఘాలను కూడా వదలకుండా దుమ్ము లేపాడు. ప్రజల కోసం జీతం తీసుకోని గొప్ప ముఖ్యమంత్రి జగన్ అంటూనే...జీతం తీసుకోవడం మానేసిన ఆయన పని చేయడం కూడా మానేశారు అని ఎద్దేవా చేశారు.