బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి శనివారం ట్వీట్ చేశారు. యాప్‌పై తలెత్తిన వివాదాలకు తెరదించాలంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ను ట్విట్టర్ వేదికగా కోరారు. ఈయాప్ విషయంలో రహస్యగా ఉంచాల్సిన అవసరం ఏంటన్నారు. ఎన్నికల సెల్ పర్యవేక్షణలో యాప్ ఉందా.. తయారైందా అనే విషయాన్ని ప్రకటిస్తే ఇంకా మంచిదని పేర్కొన్నారు. ఒకవేళ ఉంటే ఈ'యాప్'కు రికార్డింగ్ మెసేజ్‌లు, ఫొటోలు, పిర్యాదులు పంపవచ్చా అని అడిగారు. కేంద్ర ఎన్నికల సంఘం లాగ ఈయాప్ ద్వారా అందే ఫిర్యాదులను ఎస్ఈసీ పరిగణిస్తారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.