ఏ స్థాయిలో ఉన్నవారైనా, ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోవాలన్నా అది ఎందుకోసమో తెలియచేస్తూ పారదర్శకత కోసం నోట్ ఫైల్స్‌తో కూడిన ఫైల్ ఉంటుంది.రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదాలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం ఎలాంటి నోట్ ఫైల్స్, ఫైల్స్ లేకుండానే వరుసగా అత్యంత వివాదాస్పద నిర్ణయాలను ఎడాపెడా తీసుకుంటున్నారు. ప్రవీణ్ ప్రకాష్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ శుక్రవారం తీసుకున్న నిర్ణయంతో సహా ఇటీవల నిమ్మగడ్డ పలు వివాదాస్పద నిర్ణయాలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో కనీసం ఎందుకు తీసుకున్నారో తెలియజేసే ఫైళ్లు కూడా లేవని స్పష్టమవుతుంది.