ఏపి లో పంచాయితీ ఎన్నికల తొలి విడుత ఎన్నికల నామినేషన్ ప్రక్రియ నేటితో ముగియనుంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ , వైసీపీ నేతలు జోరును పెంచారు. నామినేషన్లు వేయడం దగ్గర నుంచి ఇప్పటివరకు ఒకరిపై మరొకరు మాటల యుద్ధం చేస్తున్నారు. మాటలతో నువ్వెంత అంటే నువ్వెంత అంటూ కాలురువ్వుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. నిమ్మగడ్డ ఊహించినట్లే వైసీపీ దాడులకు దిగుతున్నారు. ఎలా అయినా ఈ సారి వీలైనంత అధిక సంఖ్యలో ఏకగ్రీవాలు చేయించాలని పట్టుదలతో అధికార పార్టీ ఉంది. ఈ నేపథ్యంలో టిడిపి తరఫున అలాగే ఇతర పార్టీల తరఫున నామినేషన్ కి వేయడానికి వెళుతున్న వారి పై దాడులు కూడా జరుగుతున్నాయని అంటున్నారు.