కడప జిల్లాలోని ఎగువపల్లె వద్ద భారీగా నగదు పట్టుబడింది. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చేపట్టిన వాహనాల తనిఖీల్లో హైదరాబాద్ నుండి వస్తున్న వెర్నా కారులో రూ.30 లక్షల నగదును అధికారులు గుర్తించారు. ఎటువంటి రికార్డ్స్ లేకపోవడంతో నగదుతో పాటు, కారును సీజ్ చేశారు. అనంతరం పెండ్లిమర్రి పోలీస్స్టేషన్లో ఎస్ఈబీ అధికారులు నగదును అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.