ఎస్ఈబీ సోమవారం రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా మెరుపు సోదాలు నిర్వహించారు. 39 మందిని అరెస్టు చేశారు. కర్నూలు జిల్లా పంచలింగాల చెక్‌పోస్టు వద్ద 3.799 కిలోల బంగారు ఆభరణాలు, 3.42కిలోల బంగారం, 439.11 కెరట్స్ వజ్రాలను స్వాదీనం చేసుకున్నారు.. నిన్న కడపలో ఎన్నికలకు సంబంధించిన 30 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇకపోతే కర్నూల్ జిల్లాలోఎస్ఈబీ ప్రత్యేక బృందాల దాడుల్లో 10,137 లీటర్ల నాటుసారా , 5,068 లీటర్ల మద్యం, 2,981 లీటర్ల బీరును స్వాదీనం చేసుకున్నారు.