చిత్తూరులో వైసీపీ నేతల ఆగడాలు ఎక్కువైయ్యాయాని తెలుస్తుంది.మదనపల్లి మండలంలో వైసీపీ నేతలు దాడులకు దిగుతున్నారు. నామినేషన్ వేసేందుకు వస్తున్న మహిళా అభ్యర్థి వద్ద పత్రాలను లాక్కెళ్లారు. పంచాయతీ వైసీపీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పద్మావతమ్మ ప్రయాణిస్తున్న కారును మార్గమద్యంలో వైసీపీ నాయకుడు 30 మంది దుండగులతో అడ్డుకున్నారు.పద్మావతమ్మ భర్త ఈశ్వరయ్య విషయాన్ని పోలీసులకు చెప్పడంతో తాలూకా ఎస్ఐ దిలీప్ అక్కడికి చేరుకుని పద్మావతమ్మ కు రక్షణ కల్పించి నామినేషన్ కేంద్రానికి తీసుకొచ్చి నామినేషన్ వేయించినట్లు తెలుస్తుంది.