కడప- తాడిపత్రి ప్రధాన రహదారిలోని ముద్దనూరు నాలుగు రోడ్ల కూడలి వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టగా.. పులివెందుల నుంచి వస్తున్న ఓ కారులో 2.7 కేజీల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సీఐ హరినాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ముద్దనూరు నాలుగు రోడ్ల కూడలి వద్ద వాహనాల తనిఖీ చేస్తున్నారు.అదే సమయంలో పులివెందుల నుంచి ముద్దనూరు కు వస్తున్న ఓ కారును తనిఖీల నిమిత్తం ఆపారు. అందులో ఉన్న రెండు బ్యాగుల్లో 2.7 కేజీల బంగారు ఆభరణాలను గుర్తించారు.