అడ్డు అదుపు లేకుండా తాగితే మనిషికి మత్తు ఎక్కుతుంది. ఆ మైకంలో వారు ఏం చేస్తున్నారో వారికే గుర్తుండదు. అయితే, అమెరికాకు చెందిన ఓ మహిళకు అసలు మద్యమే అలవాటు లేదు. ఎప్పుడూ దాన్ని ముట్టనూలేదు. అయినా ఆమెను నిత్యం మత్తు ఆవహిస్తోంది. మద్యం తాగినవాళ్లలా మార్చేస్తోంది. ఇందుకు ఆటో-బ్రేవరీ సిండ్రోమ్ అనే వ్యాధి కారణమని వైద్య నిపుణులు పరీక్షించి తేల్చి చెప్పారు.