చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం సంతబైలు పంచాయతీకి గతంలో సర్పంచ్‌గా పనిచేసిన పెద్దిరెడ్డి గ్రామాభివృద్ధికి విశేష కృషి చేశారు. తాజా ఎన్నికల్లో ఆయన భార్య రాజేశ్వరి పోటీకి దిగడంతో గ్రామస్తులందరూ ఆమె భర్త సేవలను పరిగణనలోకి తీసుకుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గొడుగుచింత పంచాయతీ సర్పంచ్ పదవికి నక్కా బాబు నామినేషన్ వేశారు. మరికొందరు కూడా పోటీకి దిగారు. అయితే బాబు తల్లి రెండు రోజుల కిందట మరణించింది. ఆ కుటుంబం పట్ల సానుభూతితో పోటీదారులు బరినుంచి తప్పుకున్నారు. దీంతో వైసీపీ మద్దతుదారు నక్కా బాబు సర్పంచ్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు..