తేనెటీగలను అధికారులు సీజ్ చేశారు.. అంత తప్పు ఏం చేశాయి? అనే సందేహాలు వస్తున్నాయి కదూ.. అవును మీరు విన్నది నిజమే.. ఓ వ్యక్తి తేనెటీగలు తీసుకొచ్చి పెంచుకోవాలని భావించాడు. కొన్ని కాదు ఏకంగా కొన్ని మిలియన్స్. అది తెలుసుకున్న ఆ దేశ అధికారులు వాటిని సీజ్ చేసి కాల్చేందుకు రెడీ అయ్యారు. విషయానికొస్తే.. తన వ్యాపారంతో పాటు బ్రిటన్లోని కొందరు తేనె రైతుల కోసం బేబీ ఇటాయలిన్ తేనెటీగలను తేనె వ్యాపారి పాట్రిక్ ముర్ఫెట్ తీసుకురావాలనున్నారు. అయితే బ్రెగ్జిట్ తర్వాత యూకే తేనెటీగలను కొన్ని దేశాల నుంచి దిగుమతి చేసుకోవడాన్ని నిషేధించింది.