పశ్చిమ బెంగాల్ కు చెందిన గోగోల్ షాహా, సుబర్ణ దాస్ ల పెళ్లి ఫిబ్రవరి 1న జరిగింది. ఈ పెళ్లికి బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలోనే హాజరయ్యారు. అయితే పెళ్లికి వచ్చిన వారిందరికీ భోజనాలు చేసే సమయంలో ఓ కార్డును అందించారు. ఎవరిదో ఆధార్ కార్డు పోగొట్టుకున్నారా.? అంటూ అనుకున్నారు. కానీ అందులో ఉన్న మ్యాటర్ చూసి ఖంగు తిన్నారు.అయితే అది ఆధార్ కార్డు కాదనీ, తాము తినబోయే వివాహవిందులో వడ్డించబోయే ఆహారపదార్థాలని తెలిసి అవాక్కయ్యారు. సోషల్ మీడియాలో మాకు ప్రశంసలు వస్తున్నాయి. దీంతో వీరిద్దరూ పాపులర్ అయ్యారు