కడప జిల్లాలో భారీ మొత్తంలో చీరలను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో స్టాటిస్టికల్ సర్వేలెన్స్ టీం ఇన్ఛార్జి సి.హెచ్. సుబ్బన్న, ఒంటిమిట్ట సీఐ హనుమంతనాయక్, తాను సిబ్బందితో కలిసి గురువారం కడప- చెన్సై జాతీయ రహదారిపై వాహనాల తనిఖీ చేపట్టామన్నారు. ఈసందర్భంగా చీరల పెట్టెలతో వచ్చిన రెండు వాహనాలను తనిఖీ చేశామన్నారు. ఒక వాహనంలో 1710 చీరలు, మరో దాంట్లో 622 చీరలు ఉన్నట్టు గుర్తించామన్నారు