చరిత్రలో కని విని ఎరుగని ఏపీలోని కడప జిల్లా కమలాపురం మండలంలోని ఓ గ్రామ పంచాయతీలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..కమలాపురం మండలంలోని చిన్నపంచాయతీగా ఉన్న ఆ గ్రామంలో కేవలం 240 ఓట్లు మాత్రమే ఉన్నాయి. ప్రతిసారి రిజర్వేషన్ లో ఉండే ఈ పంచాయతీ ఈసారి జనరల్ కేటగిరీకి వచ్చింది. రూ20 లక్షలు ఇస్తానని.. సర్పంచ్ పదవి తనకే ఇవ్వాలని చెప్పాడు. అందుకు గ్రామస్తులు కూడా ఓకే చెప్పారు. ఐతే ఆ మొత్తాన్ని గ్రామాభివృద్ధికి కాకుండా.. ఓటర్లకు పంచేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఆ లెక్కన గ్రామంలోని ఒక్కో ఓటుకు రూ.8వేల చొప్పున పంచాలని నిర్ణయించారు. దీంతో గ్రామస్తులే సదరు అభ్యర్థికి పోటీ లేకుండా చేయడానికి ఇతరులతో సంప్రదింపులు జరుపుతున్నారు..