ఘటన ముంబైలో చోటుచేసుకుంది. సెప్టెంబరు 2017లో చోటుచేసుకున్న ఘటన వివరాలిలా ఉన్నాయి. సచిన్ మలోర్, రంజన ఇరువురు దంపతులు. మద్యం సేవించి ఇంటికి వచ్చిన సచిన్ మలోర్కు భార్య పెరుగు తింటూ కనిపించింది. ఆ సమయంలో రంజన తల్లి పెరుగును ప్యాక్ చేసింది. ఇది గమనించిన సచిన్ పెరుగు విషయంలో భార్యతో గొడవకు దిగాడు. ఆమె ప్రతిఘటించడంతో కిందకు తోసేశాడు. వంట గదిలోకి వెళ్లి కత్తిని తీసుకువచ్చి భార్య కడుపులో పొడిచాడు.