ఆంధ్ర ప్రదేశ్ పంచాయితీ ఎన్నికల పోలింగ్ సమీస్తున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలీసులు చర్యలను ముమ్మరం చేశారు. అంతేకాదు ఎక్కడ కూడా నగదు , పంపిణీ లు జరగకుండా నిఘా పెడుతున్నారు.ఈ మేరకు కడపలో పోలీసులు జిల్లా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. ఒక్కో విడతలో సుమారు 2 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫలితంగా జిల్లాలోని పోలీసు ఠాణాల్లో ఒకరిద్దరు సిబ్బంది తప్ప ఎవరూ ఉండడంలేదు. ఎప్పుడు బయటి ప్రాంతాలకు విధులకు వెళ్లని ట్రాఫిక్ పోలీసులు కూడా పల్లెబాట పట్టారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్ఛు.