తిరుపతి వడమాల పేటలో కదిరిమంగళం పంచాయతీకి తొలిసారి ఎన్నికలు నిర్వహించనున్నారు. నిన్నటి వరకు ఏకగ్రీవాల బాటలో పయనించింది. 1965లో ఈ పంచాయతీకి తొలుత ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి కందేరి రామచంద్రనాయుడు రెండు మార్లు, కందేరి రాజా నాయుడు, కె.వెంకటేష్, కె.సుబ్బమ్మ, కె.దామోదరం, మల్లం మోహన్‌రామిరెడ్డి, రాధ ఏకగ్రీవ సర్పంచ్‌లుగా సేవలందించారు..కానీ ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేసేందుకు యువత ముందుకు వస్తున్నారు.