జీహెచ్ఎంసీ ఎన్నికలకు నాలుగు నెలల ముందు పార్టీలోకి వచ్చిన వెంకటేశ్‌కు టికెట్ ఇవ్వడం అన్నీ క్షణాల్లో జరిగిపోయింది. ఎన్నికల ఫలితాల తర్వాత డివిజన్లో పరిణామాలు వేగంగా మారిపోయాయి. ఎన్నికల అఫిడవిట్లో ఇద్దరు పిల్లల నిబంధనను ఉల్లంఘించి గెలిచిన డేరంగుల వెంకటేశ్ ఎన్నికను రద్దు చేయాలంటూ టీఆర్ఎస్ సిట్టింగ్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ ఎన్నికల ట్రిబ్యునల్ ఆఫీసర్ ను కలిశారు. ఈ మేరకు ఈ కేసును మూడు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. దీంతో బీజేపి పార్టీ నేతలలో ఆందోళన మొదలైంది.