రాయలసీమ జిల్లాలో కడప , చిత్తూరు జిల్లాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. టీడీపీ , వైసీపీ పార్టీలు నువ్వా నేనా అనే రేంజ్ లో పోటీలో కొనసాగుతున్నాయి. చిత్తూరులో టీడీపీ శ్రేణులు ప్రజలను ప్రలోబాలకు గురి చేస్తున్నాయి. వైసీపీ నేతలు, కార్యకర్తలు దౌర్జ్యానాలకు పాల్పడుతున్నారు. ఇక కడప విషయానికొస్తే..చాపాడు మండలం బద్రిపల్లె పోలింగ్ బూత్ దగ్గర వైసిపి, టిడిపి మద్దతు దారు ఏజంట్ల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణ లో టిడిపి మద్దతుదారు వర్గీయ ఓటరుకు గాయాలు తగిలాయి.టిడిపి మద్దతు ఓటరును ఓటు వేయకుండా వైసిపి మద్దతు ఏజెంటు అడ్డుకున్నారు