తిరుపతి రామచంద్రాపురం మండలం కమ్మకండ్రిగ పోలింగ్ కేంద్రం వద్ద గొడవ తారాస్థాయికి చేరుకుంది.ఓటర్ స్లిప్ లపై ఎన్నికల గుర్తులు రాసి పంపుతున్నారని టిడిపి మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని బూత్ వద్ద ఉన్న పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నా కూడా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం టీడీపీ వర్గాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అధికార పార్టీ మద్దతు సర్పంచ్ అభ్యర్థి ఇలా చేస్తున్నారని ఆరోపణ.కమ్మ కండ్రిగ పోలింగ్ బూతులో రిగ్గింగ్ జరుగుతోందని వెల్లడించారు.4, 5 వార్డులకు సంబంధించిన పోలింగ్ బూతులో పోలింగ్ సిబ్బందే ఓట్లు వేస్తారని ఏజెంట్ల చెప్పుకొచ్చారు.