పోలీసులు భద్రతలను మాత్రమే కాదు.. మానవత్వాన్ని కూడా చాటుకున్నారు.పోలింగ్ బూత్ ల వద్ద ఒకవైపు విధులను నిర్వర్తిస్తూనే మరో వైపు ఓటు వేయడానికి వస్తున్న వృద్దులకు ఆసరాగా నిలుస్తున్నారు. ఖాకీలకు కూడా మనసుంటదని ఓ కానిస్టేబుల్ నిరూపించాడు. వివరాల్లోకి వెళితే.. కడప జిల్లాలోని ఖాజీపేట జిల్లా పరిషత్ బాలుర పోలింగ్ కేంద్రం లో నడవలేని స్థితి లో ఉన్న వృద్దురాలికి స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ చేయూతను అందించాడు.ఓటు వేసేందుకు వృద్దురాలికని మోసుకుంటూ పోలింగ్ కేంద్రంలోనికి తీసుకెళ్లి ఆమె చేత ఓటు వేయించి తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించాడు. దీంతో అక్కడ ఉన్న వారంతా అతన్ని అభినందించారు.