ఎస్ఈసీ తీసుకొచ్చిన ఈ వాచ్ యాప్‌కు భద్రతా అనుమతులు తీసుకోకపోవడంతో, వాటి కోసం దరఖాస్తు చేసినా ఆలస్యం అవుతుండటం వంటి కారణాలతో యాప్‌కు చుక్కెదురైంది. ఇప్పటికే ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న నిఘా యాప్‌తో పాటు సీ-క్యాప్ యాప్‌ను వాడుకుంటామని ఎస్ఈసీ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు.దీంతో హైకోర్టు ఈ యాప్‌పై తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది...