సీఎం సొంత జిల్లాలో ఫ్యాన్ గాలి జోరుగా తిరుగుతుంది. అనుకున్న విధంగా వైసీపీ అభ్యర్థులు టీడీపీ పై అత్యధిక స్థానాల్లో , అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. స్థానిక ఎన్నికల పరిస్థితి మళ్లీ రిపీట్ అయ్యేలా కడపలో పరిస్థితి కనపడుతుంది. కడపలో ఇప్పటివరకు వెలువడిన ఫలితాలను చూస్తే వైసీపీ ఫ్యాన్ స్పీడ్ ముందు టీడీపీ గల్లంతు అయ్యేలా కనపడుతుంది. ఫలితాలను పరిశీలిస్తే.. కడపలో మొత్తంగా 206 స్థానాల్లో పోటీ చేయగా వైసీపీ 55 స్థానాల్లో విజయాన్ని కైవసం చేసుకోగా, టీడీపీ ఇంకా ఖాతాను తెరవ లేదని తెలుస్తుంది.