కడపలో భారీగా నగదు, చీరలను చెక్‌పోస్టు వద్ద సిట్టింగ్ స్క్వాడ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.కడప-తాడిపత్రి ప్రధాన రహదారిలో చెక్‌పోస్టు వద్ద మంగళవారం వాహనాల తనిఖీ చేపట్టారు.అందులో భాగంగా రూ.10 లక్షల నగదును స్వాధీనం చేసుకోగా, రాజంపేట చెక్ పోస్ట్ వద్ద తనిఖీల్లో 45 చీరలను, 60 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. వీటికి ఎటువంటి రసీదులు లేకపోవడంతోనే తీసుకున్నట్లు వెల్లడించారు.