మొదటి విడత లో చిత్తూరు, గుంటూరు ఏకగ్రీవాల లో టాప్ లో ఉండగా , రెండో విడతలో గుంటూరు, ప్రకాశం టాప్ లో ఉన్నాయి.గుంటూరు జిల్లాలో 70 పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. ప్రకాశం జిల్లాలో 69 ఏకగ్రీవమయ్యాయి. ఆ తర్వాత స్దానాల్లో చిత్తూరు 62, విజయనగరం 60, కర్నూలు 57, శ్రీకాకుళం 41, కడపలో 40, కృష్ణాలో 36, నెల్లూరులో 35, విశాఖలో 22, తూర్పుగోదావరిలో 17, పశ్చిమగోదావరిలో 15, అనంతపురంలో 15 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మరో మూడు రోజుల్లో మిగిలిన చోట్ల రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి... మరి ఈ నియోజక వర్గాల్లో ఎవరికీ విజయం వరిస్తుందో చూడాలి..