రాజమండ్రిలో దానవాయిపేటలో ఇటీవలే కొత్తగా ఓ హోటల్ ప్రారంభమయింది. ఆ హోటల్ పేరు ' నా పొట్ట నా ఇష్టం ' ఈ హోటల్ కు వచ్చిన వాళ్లు తినడం ఆపరనీ, అంతలా తినేస్తున్నావేంటని ఎవరైనా అడిగితే 'నా పొట్ట నా ఇష్టం. ఇక్కడ ఎంతైనా తినాలనిపిస్తుంది' అని కస్టమర్లు చెబుతున్నట్టుగా ఉంది కదూ. ఈ హోటల్ పేరు కాస్తా నెట్టింట తెగ వైరల్ గా మారింది. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ తో వైరల్ చేస్తున్నారు. పేర్లు పెట్టాలన్నా, సెటైర్లు వేయాలన్నా గోదారోళ్ల తర్వాతే ఎవరైనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.