చిత్తూరులో ఎన్నికల వేడి రాజుకుంది.. రాష్ట్రంలో నాలుగు విడతల్లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.. మొదటి విడత ఎన్నికల టీడీపీ కి గట్టి దెబ్బ వేశాయి..తొలివిడత పంచాయతీ ఎన్నికల ఫలితాలను చూసి టీడీపీ శ్రేణుల్లో మార్పు కనిపిస్తోంది. అధినేత చంద్రబాబు తీరుతో కార్యకర్తలు విసిగిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం వృథా అని నిర్ణయానికి వస్తున్నారు. కొందరు తటస్థంగా ఉండటానికి ఇష్టపడుతుంటే.. మరి కొందరు పార్టీ మారేందుకు కార్యాచరణ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎక్కడా గెలుస్తామని కనిపించలేదు అంటూ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.