కడప జిల్లాలో ఉదయం 6.30 గంటలకు పోలింగ్ ప్రారంభం అయ్యాయి. ఓటర్లు కూడా ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎండ ఎక్కువగా ఉన్న కారణంతో ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. రాయచోటి, కమలాపురం నియోజకవర్గాల పరిధిలోని 12మండలాల్లో 135 సర్పంచ్ స్ధానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.మొత్తం 175 స్థానాలకు గాను 40 ఏకగ్రీవం కాగా 135 స్థానాలకు ఎన్నికలను నిర్వహిస్తున్నారు.అత్యంత సంస్యాత్మక గ్రామాల్లో పోలీసులు నిఘాను పెంచారు.169 సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాల్లో వెబ్ క్యాస్టింగ్, మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణ లో పోలింగ్ నిర్వహిస్తున్నారు.1770 పోలింగ్ కేంద్రాల్లో 3,19,284 మంది ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కడపలో ఎవరు విజయాన్ని అందుకుంటారో చూడాలి..