పెరుమాళ్లపల్లె పంచాయతీ ఎంపీటీసీ మాజీ సభ్యులు, తెదేపా జిల్లా ఉపాధ్యక్షుడు ఈశ్వర్‌రెడ్డి అన్నారు. తిరుపతి గ్రామీణ మండలం పెరుమాళ్లపల్లె పంచాయతీలోని 12 వార్డు సభ్యుల నామినేషన్లు తిరస్కరించడంతో తిరుపతి, చంద్రగిరి ప్రధాన రహదారి వద్ద శనివారం ఆందోళన చేపట్టారు. ఆయన మాట్లాడుతూ ఎక్కడాలేని విధంగా రిటర్నింగ్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం 12 వార్డు సభ్యుల నామినేషన్లు తిరస్కరించారని చెప్పారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు నామినేషన్లు తిరస్కరించారని ఆవేదన వ్యక్తంచేశారు..ఈ విషయమై ఆర్డీవో, ఉప ఎన్నికల అధికారికి, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశామన్నారు.. ఈ విషయం పై వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.