తాజాగా బీటెక్ రవి మీడియా తో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఎక్కడా ఓడిపోలేదని.. ప్రజాస్వామ్యమే ఓటమిపాలైందని శాసనమండలి సభ్యుడు బీటెక్ రవి అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సొంత నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం పూర్తిగా లోపించిందని, ఇందుకు తాను ప్రజాస్వామ్యానికి, ప్రజలకు క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు. కడప నగరంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల మండలి సభ్యుడిగా ఎన్నికైన నేను పంచాయతీల్లో స్వేచ్ఛగా ఎన్నికలు జరిపించలేకపోవడం నిజంగా భాదకరం అని వ్యాఖ్యానించారు.