రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్ ఎన్నికల వేడి వాతావరణం కొనసాగుతుంది.. సీఎం జగన్ సొంత జిల్లాలో ఎన్నికల పై పార్టీలు ప్రత్యేక శ్రద్ధను చూపిస్తున్నారు. ఎన్నికల కమీషన్ కూడా అదే విధంగా నిఘాను పెడుతున్నారు.పులివెందుల, రాయచోటిల్లో 21 వార్డుల్లోనూ, పుంగనూరులో 16, పలమనేరు, మాచర్లల్లో చెరో పది వార్డుల్లో సింగిల్ నామినేషన్ల దాఖలు అయింది.తిరుపతి కార్పోరేషన్లోని 6 డివిజన్లల్లో సింగిల్ నామినేషన్ దాఖలు చేశారు. ఇకపోతే కలెక్టర్ల నుంచి నివేదికలు వచ్చాక తుది నిర్ణయం ఎన్నికల కమీషన్ తీసుకోనున్నారు.