హైదరాబాద్ వాసులకు దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. మొన్నటి దాకా కరోనా భయంతో ఎటు పోలేని స్థితి ఏర్పడింది.దాదాపు ఏడాది పాటు ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇప్పుడు మాత్రం డీజిల్, పెట్రోల్ ధరలతో పాటుగా నిత్యావసర వస్తువుల పై ధరలు భారీగా పెరిగాయి. దీంతో సామాన్యుడు కూడా తినడానికి వెనుకంజ వేస్తున్నారని తెలుస్తుంది. ఇప్పుడు మరో బాంబ్ లాంటి వార్త షికారు చేస్తోంది. బియ్యం ధరలు సైతం ఆకాశాన్ని తాకాయి. గతేడాది సన్నబియ్యం కిలో ధర 40 రూపాయల నుంచి 45 రూపాయల వరకు పలకగా ప్రస్తుతం కిలో బియ్యం రూ.48 నుంచి రూ.55 పలుకుతుండటం గమనార్హం.