చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ పంచాయతీలో ఓ అభ్యర్థి తనకు ఓటు వేసి గెలిపించాలంటూ గ్రామస్థులకు తిరుమల లడ్డూలు పంచుతూ ప్రచారం నిర్వహించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం భక్తులు అవస్థలు పడుతుంటే.. తొండవాడలో ఓటు కోసం శ్రీవారి లడ్డూలను పంచడం తీవ్ర చర్చనీయాంశమైంది.ఎంఆర్వో చిన్న వెంకటేశ్వర్లును వివరణ కోరగా ఓటర్లకు లడ్డూలు పంచుతున్న విషయం తన దృష్టికి రాలేదన్నారు. విచారణ జరిపి నిజమని తేలితే అభ్యర్థిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు..