ప్రజలందరికీ వ్యాక్సిన్‌ను అందించి ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.జెనియా గ్యాస్ట్రో పబ్‌లో ఒక ప్రత్యేక ఆఫర్‌ను పెట్టారు. మొదటి,రెండు వ్యాక్సిన్ డోసును తీసుకున్న వారికి ఒక బీర్‌ను ఉచితంగా ఇస్తున్నట్లు వారు ప్రకటించారు. వ్యాక్సిన్ నిబంధనల మేరకు ఆల్కహాల్ లేని డ్రింకులను అందిస్తున్నట్లు ఆ పబ్ నిర్వాహకులు తెలిపారు. ''వ్యాక్సిన్ తీసుకొనే చోటుకు మనం వెళ్లలేకపోయినపుడు, మనం వెళ్లే చోటుకే వ్యాక్సిన్‌ను తీసుకురావడమన్నది మంచి ఆలోచన'' అని ఆ పబ్‌లో వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న మే పెరేజ్ వెల్లడించారు