తిరుమల పోటులో లడ్డూలు తయారు చేసి ట్రేలలో పెట్టి విక్రయకేంద్రాలకు తరలిస్తారు.తిరుమల కాకుండా కరోనాకు ముందు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ల్లోనూ వీటి విక్రయాలు సాగాయి. ఆయా నగరాలకు మాత్రమే తితిదే ప్రత్యేక వాహనంలో లడ్డూ ట్రేలను తరలించే వారు. అంతకుమించి తితిదే అధికారులు.. వ్యక్తిగత అవసరాలకు ట్రేలలో లడ్డూలను పంపిన విషయం తెలిసిందే.. ఇక ఇప్పుడు ఇలా చంద్రగిరిలో పంచినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రైవేటు వ్యక్తుల చేతికి లడ్డూల ట్రేలు ఎలా వచ్చాయనే దానిపై తితిదే సమాధానం చెప్పాలని ప్రతిపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు.