మూడు విడతల ఎన్నికలతో పోలిస్తే నాలుగో విడత ఎన్నికలు కాస్త రసాభాసగా జరుగుతున్నాయి. ఆ మూడుంటి ఫలితాలు టీడీపీకి షాక్ ఇవ్వగా, జనసేన కు సంతోషాన్ని ఇచ్చాయి. అధికార పార్టీకి విజయాన్ని అందించాయి. ఈరోజు ఉదయం 6.30 కు మొదలైన పోలింగ్ మధ్యాహ్నం వచ్చేలోపు స్పీడ్ అందుకుంది. గత మూడు విడతల కంటే పోలింగ్ శాతం భారీగా పెరుగుతోంది. ఉయం 10.30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 41.55 పోలింగ్ శాతం నమోదయింది. ఇక మొదటి నాలుగు గంటలకే 50 శాతం మార్క్ దాటి విజయనగరం జిల్లా దూసుకు పోతోంది. విజయనగరం జిల్లాలో అత్యధిక పోలింగ్ శాతం నమోదు కాగా, నెల్లూరు జిల్లాలో అత్యల్ప పోలింగ్ నమోదయింది.