ఒక విద్యార్థిని మాత్రం అందుకు విచిత్రంగా చేసింది. పరీక్ష రాసేందుకు వెళ్లి మూడు రోజులు తిరిగి రాలేదు.. నాలుగో రోజు పెళ్లి చేసుకొని వచ్చి తల్లి దండ్రులకు షాక్ ఇచ్చింది. ఈ ఘటన రాజస్థాన్ జొద్ పూరు లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. 2016లో మొబైల్ ఫోన్కు మిస్ కాల్ వచ్చింది. అలా నితీశ్తో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. నాలుగేండ్ల పాటు ప్రేమించుకున్న వీరి పెండ్లికి ఇరు కుటుంబాలు నిరాకరించాయి. దీంతో వారే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుని పోలీసుల సహాయం కోరారు.