పంచాయితీ ఎన్నికల్లో 81.78 శాతం పోలింగ్ నమోదైందని, అదే స్ఫూర్తితో పురపాలక ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని మరింతగా పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో, అవాంఛనీయ ఘటనలకు ఆస్కారమివ్వని రీతిలో ఎన్నికలు నిర్వహిస్తే, పట్టణ ప్రజలందరూ స్వచ్ఛందంగా ఓట్లు వేసేందుకు ముందుకు వస్తారన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ కాస్టింగ్, సీసీ కెమెరాల ఏర్పాటు, వీడియోగ్రఫీ ద్వారా నిఘా ఉంచాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో కొవిడ్-19 నిబంధనావళి కచ్చితంగా అమలయ్యేలా చూడాలని స్పష్టం చేశారు.