భార్యను ఎవరో అపరిహరించారు. అయితే ఆమె వారి చర నుంచి తప్పించుకొని ఎలాగో బయటపడింది. కానీ నూరేళ్ళు తోడుగా ఉంటాను అనుకున్న భర్త అనుమానంతో రగిలిపోయాడు. దాంతో ఆమెకు శీల పరీక్ష పెట్టాలని అనుకున్నాడు. అసలు చివరికి ఎంటి ఫలితం అనేది అందరిలో ఆసక్తి చూపిస్తున్నారు. మహారాష్ట్రలోని ఉస్మానాభాద్లో ఒక మహిళ తన పాతివ్రత్యాన్ని నిరూపించుకునేందుకు సలసలా మరుగుతున్న నూనెలో చేయిని పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉస్మానాబాద్ పరిధిలోని పరండాకు చెందిన ఒక మహిళ నాలుగు రోజుల పాటు అదృశ్యమై ఆ తరువాత ఇంటికి తిరిగి రావడంతో... మరుగుతున్న నూనెలో చేయిపెట్టి, దానిలోని ఐదు రూపాయల నాణాన్ని బయటకు తీయాలని ఆదేశించాడు.