పులివెందుల పురపాలక సంఘంలో మొత్తం 33 వార్డులకు 21, రాయచోటిలో మొత్తం 34 వార్డులకు 21 చోట్ల ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలవ్వడంపై ఎస్ఈసీ సందేహం వ్యక్తం చేసింది. పులివెందుల పురపాలక సంఘానికి సంబంధించి అభ్యర్థులు నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకపోవడంతో అక్కడ ఎన్నికలు సజావుగానే జరిగినట్లు జిల్లా అధికారులు ఎస్ఈసీకి నివేదించినట్లు సమాచారం. రాయచోటి పురపాలక సంఘంలో మాత్రం నామినేషన్ల సమయంలో పలు హింసాత్మక సంఘటనలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. వీటికి సంబంధించి ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగులను ఎస్ఈసీకి పంపించారు.