ఓ వ్యక్తికి ఓ ఫుడ్ డెలివరీ కంపెనీ దిమ్మతిరిగే షాకిచ్చింది. అతడు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం కూల్డ్రింక్ బాటిల్ పంపింది. కానీ అందులో యూరిన్ నింపి ఉంది. ఈ దారుణ ఘటన యూకేలో చోటు చేసుకుంది. ఒలీవర్ మెక్మానస్ లాక్డౌన్లో భోజనం ఆర్డర్ చేశాడు. అందులో కూల్డ్రింక్ కూడా ఉంది.. అలా ఆర్డర్ తీసుకున్నాడు.  బాటిల్లో ఉన్నది ఏదో తేడాగా కనిపించింది. తీరా అది మనిషి యూరిన్ అని అర్థం కావడంతో అతడికి కడుపులో దేవినట్లైంది. ఆకలితో ఉన్న నాకు ఇలా యూరిన్ బాటిల్ పంపుతారా అని ఆవేశంతో ఊగిపోయాడు.. ఆ బాటిల్ ను ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.