అద్దంకి మండలంలోని ధేనువకొండ, మోదేపల్లి గ్రామాల్లో టీడీపీ మద్దతు దారులు పంచాయతీ సర్పంచ్ లుగా గెలుపొందారు.. ఈ మేరకు ఆ రెండు గ్రామాల్లో వాలంటీర్లు పని చేయడం లేదని ఆరోపణలతో వైసీపీ నేత ఆగ్రహించారు.ధేనువకొండ గ్రామంలో ఏడుగురు, మోదేపల్లి గ్రామంలో ముగ్గురు వాలంటీర్లను తొలగిస్తూ అద్దంకి ఎంపిడిఓ రాజేంద్ర ఉత్తర్వులు జారీ చేశారు.17వ తేదీతో ఉత్తర్వులు జారీ కాగా వాటిని ఆయా వాలంటీర్లకు మంగళవారం అందజేశారు. మరో వైపు అద్దంకి నియోజక వర్గంలోని మరికొన్ని పంచాయతీల్లో కూడా వాలంటీర్లను తొలిగిస్తున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.