19న నాయకులు, ముఖ్య కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్సు నిర్వహించి క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకున్న చంద్రబాబు.. ఆరు రోజుల వ్యవధిలోనే కుప్పం పర్యటన ఖరారు చేసుకోవడం అనేక చర్చలకు దారి తీస్తుంది.నియోజకవర్గంలో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలనే కృతనిశ్చయంతో చంద్రబాబునాయుడు ఉన్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. గతేడాది ఫిబ్రవరిలో జరిగిన సమావేశాల్లోనే ఆయన ఈ విషయాన్ని ప్రకటించినా.. తాజాగా ఈ నిర్ణయాన్ని ఆచరణలో పెట్టేందుకు సంకల్పించారని సమాచారం.. ఇక రానున్న ఎన్నికల్లో వైసీపీని తట్టుకొని ఎలా పోటీలో ఉండాలి, ఎన్నికలను ప్రచారం చేస్తే ప్రజలు ఓట్లు వేస్తారు ఇలాంటి అంశాలపై బాబు దిశానిర్దేశం చేయనున్నారు..