రాజస్తాన్‌లోని షేఖావతిలో ఈ నయా వివాహ వేడుక చోటు చేసుకుంది. రతన్‌గఢ్ తహసీల్‌లో ఓ చిన్న గ్రామానికి చెందిన కోటీశ్వరుడు తన కుమారుడి కోరిక మేరకు 'బరాత్' వేడుక కోసం హెలికాప్టర్ని రంగంలోకి దించాడు. వివాహం పూర్తయిన వెంటనే కొత్త జంట బరాత్ వేడుక కోసం హెలికాప్టర్లో ఎక్కి ఊరేగింది. ఈ తతంగాన్ని రిపోర్ట్ చేయడం కోసం ఓ జర్నలిస్ట్‌ని కూడా నియమించుకున్నాడు సదరు పెళ్లి కుమారుడి తండ్రి. ఈ రిపోర్టర్ వివాహం జరగుతున్న చోట ఉన్న పరిస్థితులు.. వధువు రియాక్షన్.. వరుడి స్పందన తదితర వివరాల గురించి పూస గుచ్చినట్లు రిపోర్డ్ చేశాడు. కుమారుడి సంతోషం కోసం ఓ తండ్రి చేసిన ప్రయత్నం.. అనే కామెటంరీతో వీడియో ప్రారంభం అవుతుంది. ఆ వీడియో ఒకటి సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది..