ఆంధ్ర ప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికలు ముగిశాయి.. ఇప్పుడు పురపాలక ఎన్నికలు రానున్నాయి. ఈ మేరకు టీడీపీ కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా టీడీపీ జెండా పాతాలని ప్రయత్నిస్తున్నారు. కొద్ది రోజులు మాత్రమే సమయం ఉండటంతో టీడీపీ కొత్త భజన మొదలు పెట్టింది. గత ఎన్నికలు లాగా కాకుండా విజయాన్ని అందుకోవాలని తెగ ప్రయత్నిస్తున్నారు. కాగా,మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు నిన్న చిత్తూరు కుప్పంలో పర్యటిస్తున్నారు.14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 12 ఏళ్లు ప్రతిపక్ష నేతగా, 25 ఏళ్లు పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నానని.. నేనేదో భయపడతాననుకుంటే ఖబడ్దార్ అని పరోక్షంగా వైకాపా నేతలను హెచ్చరించారు.