హర్యానాలో దారుణం చోటుచేసుకుంది. కురుక్షేత్ర జిల్లాలోని బబైన్ ప్రాంతంలోని ఓ హోటల్లో పన్నెండో తరగతి విద్యార్థినిపై ఐదుగురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. నిందితుల్లో ఒకరు మైనర్ అని పోలీసులు తెలిపారు.